BIG BREAKING : చంద్రబాబు సమక్షంలో TDPలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ

-

భారతీయ జనతా పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 16 వ తేదీన ఉదయం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కన్నా లక్ష్మీనారాయణ.

ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా బిజెపి పార్టీని వీడారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారనే దానిపై అందరిలోనూ సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే, టీడీపీ చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్ధం అయ్యారు. ఈ నెల 23వ తేదీన టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ అప్డేట్‌ పై ఇవాళ క్లారిటీ వచ్చింది. టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక ఖరారు అయింది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో కన్నా చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news