రాజకీయాల్లో యువ నాయకుల పాత్ర చాలా కీలకమనే చెప్పాలి..ఏ పార్టీకైనా యువకులు సపోర్ట్ ఎక్కువ ఉంటే..ఆ పార్టీ సక్సెస్ అవుతుంది.అలాగే యువ నాయకులని ఎంకరేజ్ చేస్తే రాజకీయంగా చాలా కాలం ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే ఏపీలో వైసీపీ ఇంత బలంగా ఉండటానికి కారణం యువ నాయకులే అని చెప్పొచ్చు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే జగన్…యువ నాయకులని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో యువ నేతలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారు.
ఇలా యువ నేతలకు సపోర్ట్ చేయడం వల్ల…రాష్ట్రంలోని యువత మద్ధతు వైసీపీకి ఎక్కువ దక్కింది. యువత మద్ధతు వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడింది. అలా యువ నాయకత్వం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది…అయితే ఆ ప్లస్ అలాగే ఉండాలంటే…యువ నాయకుల ప్రజా మద్ధతు పోగొట్టుకోకుండా ఉండాలి. ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ…వారి కోసం పనిచేయాలి. కానీ వైసీపీలో ఉండే యువ ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు ఈ విషయంలో వెనుకబడి ఉన్నట్లు ఉన్నారు. అందుకే పలువురుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. దీని వల్ల వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది. అసలే జగన్ నెక్స్ట్ 175కి 175 సీట్లు గెలుచుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని కష్టపడుతున్నారు. కానీ కొందరు యువ నేతలు తీరు చూస్తుంటే 175 సంగతి పక్కన పెడితే…అసలు అధికారంలోకి వస్తారా? అనే డౌట్ పెరుగుతుంది.
ముఖ్యంగా తొలిసారి గెలిచి ఎమ్మెల్యేలు అయ్యి…వెంటనే మంత్రి పదవులు కొట్టేసిన గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజుల దూకుడు…వైసీపీకి ప్లస్ కాకపోగా, మైనస్ అయ్యేలా ఉంది. ప్రత్యర్ధి పార్టీలైన టీడీపీ, జనసేనలపై వీరు దూకుడుగానే వెళుతూ…కౌంటర్లు ఇస్తున్నారు…కానీ వీరి కౌంటర్లు రివర్స్ అయ్యేలా ఉన్నాయి. మంత్రులుగా పెద్దగా పనిచేసేది ఏమి లేకపోయినా…ప్రతిపక్ష నేతలపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం అనేది ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా వీరి వల్ల వైసీపీకి పాజిటివ్ పెరగడం కంటే నెగిటివ్ పెరిగేలా ఉందని అంటున్నారు.