మహేష్ “పోకిరి” లా ఉంటే ఇష్టం : హరీష్ శంకర్

-

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ పండుగ లాగా జరుగుతోంది. సినీ ప్రముఖులు, అనేకమంది సెలబ్రిటీలు మహేష్ గురించి ఎంతో గొప్పగా రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మహేష్ బాబు పోకిరి సినిమాలో ఉన్న ఒక షాట్ ను వీడియో రూపంలో పెట్టి ప్రిన్స్ మహేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు మహేష్ బాబు అలా చూడటం చాలా ఇష్టమని, ఆ క్యారెక్టర్ లో మహేష్ బాబు చేతిలో కర్చీఫ్ పట్టుకొని నడుస్తూ ఉంటే చూడటానికి ఎంతో అందంగా ఉందని రాసుకొచ్చారు.

Harish Shankar
Harish Shankar

ఎప్పటికైనా మహేష్ బాబు తో అలాంటి సూపర్ హిట్ సినిమా చేయాలని ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా హరీష్ శంకర్ తెలిపారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మరో సారి హరీష్ శంకర్ కెరియర్ లో హిట్ రాలేదు. మరి మహేష్ బాబును హీరోగా ఎలాంటి రోల్ లో చూపించాలని హరీష్ అనుకుంటున్నాడు తెలియాలి. మరోసారి పోకిరి లాంటి ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందించితే మహేష్ అభిమానులకు పండుగే.

Read more RELATED
Recommended to you

Latest news