వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు

-

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పన్నెండు రోజుల పాటు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు పదిహేను రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటీషన్ వేసుకున్నారు. పదిరోజుల పాటు… దీనిపై విచారించిన సీబీఐ కోర్టు వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడిన బెయిల్ ను పన్నెండు రోజులు పాటు మంజూరు చేసింది. ఎస్కార్ట్ తో కూడిన బెయిల్ ను మాత్రమే ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానం నిర్ణయించింది. దీంతో వైఎస్ భాస్కర్ రెడ్డికి పన్నెండు రోజుల పాటు బెయిల్ లభించినట్లయింది.

YS Bhaskar Reddy | వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌-Namasthe  Telangana

ఇది ఇలా ఉంటె, వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు శివశంకర్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న A-5 నిందితుడు శివశంకర్‌ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. శివ శంకర్ రెడ్డి పిటిషన్ విచారించిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news