జగన్ ముందు చూపు .. ఏపీ కి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోందా ? ఈ లెక్కలు చూడండి !

-

కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నారు. ముందు నుండి వైరస్ కంట్రోల్ చేయడంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అద్భుతంగా ఉపయోగించుకోవడం అందరికి తెలిసిందే. ఢిల్లీ ఘటన మినహా అంతకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ ని చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. ఢిల్లీ ఘటన ఎప్పుడైతే బయటపడిందో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. YS Jagan Mohan Reddy: HC orders CBI probe into death of YS Jagan ...దీంతో జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మరోపక్క వైద్య పరికరాలు మరియు సదుపాయాలు ఉండేలా నిర్ణయాలు తీసుకుని ప్రస్తుతం చాలా వరకు రాష్ట్రంలో వైరస్ ని కంట్రోల్ చేశారు. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ముందుచూపుతో పరీక్షలు నిర్వహిస్తూ లాక్ డౌన్ పూర్తయ్యేలోపు రాష్ట్రంలో వైరస్ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు రోజుకు పది వేలకు పైగా శాంపిల్స్ ని టెస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో  కరోనా వైరస్ సోకిన వ్యాధి గ్రస్తులకు మంచి డైట్ ఇవటంతో ఏపీలో డిశ్చార్జి శాతం దేశవ్యాప్తంగా కోలుకున్న వారి డిశ్చార్జ్ శాతం కంటే ఎక్కువగా ఉంది.

 

అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్ రోగుల శాతం 69.24గా ఉండగా, ఏపీలో 66.24శాతం మంది. కాగా వీరిలో రెండోసారి నెగెటివ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెస్ట్ రిపోర్ట్ లు వస్తే వీరు కూడా డిశ్చార్జి అయిపోతారని తెలుస్తోంది. మొత్తంమీద చూసుకుంటే జగన్ ముందుచూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాజిటివ్ రిజల్ట్ తీసుకువచ్చే విధంగానే ఉంది అని అంటున్నారు వైద్య నిపుణులు. 

Read more RELATED
Recommended to you

Latest news