చిరు – జ‌గ‌న్ భేటీ… మెగా ఫ్యాన్స్ నిట్ట నిలువునా చీలిపోయారు…

-

వైఎస్ కుటుంబానికి మెగాస్టార్ ఫ్యామిలీకి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటినుంచి సఖ్యత లేదు సమరం లేదు. మధ్యలో యువరాజ్యం అధినేతగా అప్పట్లో పవన్ కళ్యాణ్ పంచెలు ఊడగొట్టేస్తాం అన్న తరువాత వీరిమధ్య దూరమే పెరిగింది. ఆ త‌ర్వాత చిరు ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. అదే టైంలో జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ స్థాపించారు. ఆ టైంలో జ‌గ‌న్‌పై చిరు విమ‌ర్శ‌లు చేశారు.. నువ్వు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడితే… నేను నిలబెడ‌తా అన్నారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్ ఏపీ సీఎం… చిరు రాజ‌కీయాల‌కు దూరంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు చిరు సోద‌రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ప‌వ‌న్ జ‌గ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఇప్ప‌టికే మెగా ఫ్యాన్స్‌లో ప‌వ‌న్ వ‌ర్గం, చిరు వ‌ర్గం అని ఉన్నాయి. ఇక ఇప్పుడు చిరు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంతో అటు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జ‌గ‌న్ సైతం ప‌వ‌న్‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తుండ‌డంతో ఇప్పుడు చిరు, ప‌వ‌న్ భేటీతో మెగా ఫ్యాన్స్ మ‌ధ్య స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న రేఖ ఏర్ప‌డ‌నుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విధానాలపై పోరాటం చేస్తున్నాడు. అటు జ‌గ‌న్‌తో పాటు వైసీపీ వాళ్లు కూడా ప‌వ‌న్‌ను గ‌ట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో చిరు కూడా ప‌వ‌న్‌కు అండ‌గా ఉంటాడ‌ని మెగా అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పుడు చిరు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మ‌రి ఇది భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో ? చూడాలి. ఇక వీరిద్ద‌రి భేటీలో కొన్ని అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయ‌ని కూడా తెలుస్తోంది. సైరాకు ఏపీలో ప‌న్ను మిన‌హాయింపుతో పాటు… టీడీపీ ఎమ్మెల్యే గంటాను వైసీపీలోకి తీసుకునే అంశం కూడా చిరు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌నున్నార‌ని తెలుస్తోంది.

కొద్ది రోజులుగా గంటా చిరు డైరెక్ష‌న్‌లోనే న‌డుస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌తో చిరంజీవి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జ‌గ‌న్ కాపుల్లో కీల‌క నేత‌ల‌ను తన వైపున‌కు తిప్పుకుంటున్నారు. చిరు పొలిటిక‌ల్‌గా రీ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటే అది వైసీపీతోనే ఉంటుంద‌ని… ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసే అంశం కూడా ఈ భేటీలో ప్ర‌స్తావ‌న‌కు రావ‌చ్చంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news