శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో ధర్మాన ప్రసాదరావు కీలక నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడిగా ఈయనకు పేరుంది. ఎటువంటి విషయాన్నైనా కల్లబొల్లి కబుర్లతో ప్రజెంట్ చేయడంలో, ఒప్పించడంలో ధర్మాన ప్రసాదరావుకి మించినవారు లేరని చాలామంది జిల్లా నాయకులు అంటుంటారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న టైం లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు… వైయస్ జగన్ ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలాసార్లు జగన్ మీద విమర్శలు దాడి చేశారు. అయితే ఆ తర్వాత కాలం మారటం రాష్ట్ర విభజన జరగడం తో ధర్మాన ప్రసాదరావు వైసిపి పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు నుంచే ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ జగన్ పార్టీలో చేరడంతో సరిగ్గా 2014 ఎన్నికల సమయం టైం లో పార్టీ లోకి ఎంటరైన ధర్మాన ప్రసాద రావుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్. అదే టైమ్ లో ఎన్నికలలో ఓడిపోవడంతో మొన్నటి వరకు కింద మీద పడుతూ పార్టీలో రాణించడం జరిగింది.
అయితే తాజాగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఎక్కడ కూడా ధర్మాన ప్రసాద్ రావు కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఒక పద్ధతి ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా వ్యవహరించే ధర్మా ప్రసాద్ రావు కి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన అన్నయ్య ధర్మాన క్రిష్ణ దాస్ కి మంత్రి పదవి ఇచ్చి…మెల్లగా ధర్మాన ప్రసాదరావు నీ రాజకీయంగా అనగ తొక్కుతున్నారు అన్న కామెంట్లు శ్రీకాకుళం జిల్లాలో కనబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే భవిష్యత్తులో ధర్మాన ప్రసాద్ కి జిల్లాలో పెద్దగా రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది.