ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రోజుల పాటు తెలంగాణా రాజధాని హైదరాబాద్ లోనే ఉండనున్నారు. శుక్రవారం కోర్ట్ కి హాజరు అయిన జగన్ అక్కడి నుంచి నేరుగా గన్నవరం వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ శనివారం హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాకకు విశిష్ట ప్రాధాన్యత నెలకొంది. గత కొన్నాళ్ళుగా హైదరాబాద్ రాని జగన్ ఇప్పుడు మూడు రోజులు ఉండటంతో,
అనేక అభిప్రాయాలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి. ఆయన సోమవారం తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. దీని కోసమే ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆస్తుల విభజనకు సంబంధించి ఆయన కెసిఆర్ తో చర్చి ఆ తర్వాత తెలంగాణా గవర్నర్ ద్వారా కేంద్రాన్ని కలవాలని, అంతకు ముందు ఏకాభిప్రాయానికి రావాలని భావిస్తున్నట్టు సమాచారం.
విభజన సమస్యలు .. షెడ్యూల్ 9 అండ్ 10 సంస్థల విభజన పై చర్చతో పాటుగా కేంద్రం వైఖరిపై కూడా వీరు చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కీలక చర్చ జరుగుతుందని, వేసవిలో సీమకు తాగునీరు ఏ విధంగా అందించాలి అనే దానిపై కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.