బాబుని ముంచిన విషయంలో జాగ్రత్త పడిన జగన్!

-

కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో.. చంద్రబాబు ఓటమికి కూడా అన్ని కారణాలనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న మాట! అయితే అందులో ప్రధాన స్థానం సంపాధించుకున్న అంశాల్లో “ఇసుక” ఒకటి! అయితే ఆ అంశం తనను ముంచకుండా జాగ్రత్తపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్!

అవును… ఉచిత ఇసుక అని చెప్పి టీడీపీ హయాంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు! ఈ విషయాలు తన దృష్టికి వచ్చినా కూడా చంద్రబాబు చూసీ చూడనట్లు గడిపేశారు.. ఫలితంగా ఏపీలో 2019 ఎన్నికల్లో ఇసుక తుఫానే వచ్చింది.. బాబుని ఎగరేసుకుపోయింది! అయితే ఈ విషయంలో మొదట్లో కాస్త విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు జగన్ తేరుకున్నారు.. జాగ్రత్తలు తీసుకున్నారు.. ఫలితంగా ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారు!

ఇసుక స‌ర‌ఫ‌రాలో మెరుగైన సంస్క‌ర‌ణ చ‌ర్య‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన ఏపీ సర్కార్.. ఇక మీద‌ట రీచ్ నుంచి స్టాక్ పాయింట్ ‌కు, అక్క‌డి నుంచి ప్ర‌జ‌ల‌కు ర‌వాణా చేసే క్లిష్ట‌త‌ర‌మైన విధానానికి స్వ‌స్తి చెప్పాల‌ని నిర్ణయించడంతోపాటు.. ట‌న్ను ఇసుక రూ.475కు మించ‌కూడ‌ద‌నే అభినందనీయమైన నిర్ణయం కూడా తీసుకుంది!

ఇదే క్రమంలో… ఆఫ్‌ లైన్‌ లోనే ఇసుక పొందే అవకాశం కల్పించనుంది. ఇక పారదర్శకత విషయానికొతే… రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం.. ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రానిపక్షంలో.. 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు! ఫలితంగా బాబుని ముంచిన అంశంలో కాస్త ఆలస్యం అయినా కూడా జగన్ జాగ్రత్తపడ్డారనే అనుకోవాలి!!

Read more RELATED
Recommended to you

Latest news