ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏది చేసినా సంచనాల కోసమేనా…! ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారడంతో పాటుగా, చరిత్రలో ఎవ్వరు చేయకుండా చేసేస్తూ తన సత్తాను చాటుకుంటున్నారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు, అధికారం ఎలా సంపాదించుకోవాలో, అందుకు తగిన విధంగా అధికార పార్టీపై విమర్శలు చేయడం, అవసరమైతే బంద్‌లు, రాస్తారోకోలు చేయడం, అసెంబ్లీలో నిలదీయడం తప్పిదే పెద్దగా చేసేది ఏమీ ఉండదు.. కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికార పక్షం చేసే పనులను నిశితంగా గమనించారు. అందులో లోటుపాట్లను గుర్తించారు.
పాలన పరమైన అంశాలను, అందులో ఉండే లోపాలను తెలుసుకున్నారు. ప్రజలు ఏమీ కోరుకుంటున్నారో వారికి ఏమీ చేస్తే మనల్ని ఆదరిస్తారో అవసోపాన పట్టారు. పార్టీ నేతలు అధికారం ఉంటే ఎలా వ్యవహరిస్తారో.. అవినీతికి ఎలా పాల్పడుతారో పక్కాగా తెలుసుకున్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులను అడ్డు పెట్టుకుని నీచమైన, నికృష్టమైన పనులు చేస్తూ అడ్డమైన గడ్డి తినడానికి ఎలా సన్నద్దం అవుతురో అర్థం చేసుకున్నారు.
విద్యార్థులకు ఏం కావాలి, నిరుద్యోగులు కోరుకునేది ఏమిటీ, రైతులు ప్రభుత్వం నుంచి ఆశించేది ఏమీటి, సబ్బండ వర్గాల ప్రజలు కోరుకునే అవసరాలు ఏంటివో బాగానే అద్యయనం చేసారు. అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతగా తన గమనించిన వాటిని అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే రోజుకో కొత్త పథకంతో ప్రజలను అబ్బుర పరుచుతున్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అది సంచలనంగానే మారిపోతుంది. ఏ పని చేసినా అది ప్రతిపక్షాలకు కంటగింపుగానే ఉంటుంది.
ఏపీ సీఎం జగన్ పాత విధానాలను పాతరేస్తూ కొత్త విధానాలతో దూసుకుపోతున్నాడు. గత పాలకులు చేసిన చెడ్డ పనులను చెండాడుతూనే కొత్తగా ప్రజలకు అక్కరకు వచ్చే పథకాలను ప్రవేశపెడుతూ విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. వాటిని అమలు చేసే క్రమంలో వచ్చే సాధక బాధకాలను అధికారులకు అప్పగించి వాటిని అలాగే వదిలేయడం లేదు.. నిత్యం సమీక్షలు చేస్తూ ప్రవేశ పెట్టిన పథకాల్లో లోపాలను తెలుసుకుంటూ వాటిని సరిచేసే పనిలో నిమగ్నమవుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఓ పథకం ప్రవేశపెడితే అది ఫైనల్‌గా భావించే పాలకులకు భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఏపీపీఎస్‌సీ వ్యవహారం. ఏపీపీఎస్‌సీలో ఇంతకు ముందు ఉద్యోగాలకు భర్తీ చేయాలంటే పరీక్షతో పాటుగా ఇంటర్య్వూ వ్యవస్థ ఉండేది. దీంతో ఇంటర్య్వూలో భారీగా అవినీతికి అస్కారం ఉండేది. ఆ విధానంతో తన అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇచ్చే వచ్చేవి.. ఇందులో సమర్థులకు అన్యాయం జరిగేది.
పరపతి ఉన్నవారికి, పైరవీ చేసుకునే వారికి, అర్థబలం, అంగబలం ఉన్నవారికి ఉద్యోగాలు వచ్చేవి.. ఈ తంతుకు స్వస్తి చెపుతూ ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్‌సీ తరహాలో నియామక పద్దతి ప్రవేశపెడితే సమర్థవంతులకు ఉద్యోగాలు వస్తాయి.. ఇందులో ఎలాంటి పైరవీలకు తావుండదు.. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు ధీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జగన్ నిర్ణయాలు, పథకాలు ఏపీ చరిత్రలో నిలిచిపోతాయనే విధంగా ఉంటున్నాయని ప్రజలు అంటున్నారు.