ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి భేటి అవుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణతో ఎక్కువ స్నేహం కోరుకున్న సంగతి తెలిసిందే. కెసిఆర్ తో చంద్రబాబు వైరంగా వెళ్ళారని తాను మాత్రం స్నేహ హస్తం అందిస్తా అని చెప్తూ గత అయిదేళ్ళు గా పరిష్కారం కాని సమస్యలను ఆయన పరిష్కరించాలని భావించి ముందు అడుగు వేసారు.
ఎప్పటికి అయినా సరే తెలంగాణా ఆస్తులను తెలంగాణకు ఇవ్వాలి కాబట్టి ముందే వాటిని ఇచ్చేసారు. ఈ నెల 13 సంక్రాంతి సందర్భంగా కెసిఆర్ ని జగన్ మరోసారి కలిసి కొన్ని కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ అంశాలతో పాటు పలు కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపుపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ ఆ ప్లాన్ ని కెసిఆర్ కి వివరించి ఆయన సలహాలను కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సచివాలయం తరలిస్తే ఏయే శాఖలను ముందు తరలించాలనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.