ఏపీలో ఇప్పుడున్న పరిస్తితుల్లో సీఎం జగన్ దెబ్బకు సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే టెన్షన్ టెన్షన్‌గా ఉంటున్నారు. జగన్‌కు తెలియకుండా ఏం చేసినా వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు వచ్చేస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో అయినా పార్టీ వీక్‌గా ఉందని తెలిస్తే చాలు జగన్ వెంటనే వచ్చే ఎన్నికల్లో అక్కడ పార్టీ జెండా ఎలా ఎగరాలనేదానిపై ఇప్పటి నుంచే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను సైతం రకరకాల మార్గాల ద్వారా తమ పార్టీలో చేర్చేసుకుంటున్నారు.
ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉన్న చోట కూడా టీడీపీని ఎలా దెబ్బకొట్టాలి? వచ్చే ఎన్నికల్లో ఎలా సీటు గెలవాలనే దానిపై జగన్ తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట మాత్రం పార్టీని ఎలా నిలబెట్టాలో తెలియక జగనే ఆందోళన పడుతోన్న పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలే చర్చించుకుంటున్నాయి. అక్కడ వైసీపీ రాష్ట్రంలో బలంగా ఉన్నా కూడా సరైన క్యాండెట్ లేక ముప్పుతిప్పలు పడుతోంది. ఆ నియోజకవర్గమే ప్రకాశం జిల్లా పరుచూరు. ఇక్కడ నుంచి గత రెండు ఎన్నికల్లోనూ ఏలూరి సాంబశివరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు.
అసుల వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ సరైన క్యాండెట్‌ను జగన్ సెట్ చేయలేదు.. అంటే ఇక్కడ ఏలూరి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో తెలుస్తోంది. పార్టీ పెట్టినప్పుడు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య ఆ పార్టీలోకి వెళ్లారు. ఆయన మరణాంతరం 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన కుమారుడు భరత్ ఓడిపోయారు. ఆ తర్వాత భరత్ చేతులు ఎత్తేయడంతో రావి రామనాథంకు పగ్గాలు ఇచ్చారు. గత ఎన్నికల్లో రామనాథంకు ఏలూరిని ఢీ కొట్టే సీన్ లేదని ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీలోకి తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో దగ్గుబాటి తనయుడు చెంచురామయ్య పోటీ చేయాల్సి ఉన్నా… చివరకు వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడారు.
ఎన్నికల్లో దగ్గుబాటి ఓడిపోవడంతో చివరకు మళ్లీ రావి రామనాథంను పార్టీలో చేర్చుకుని ( ఎన్నికలకు ముందు రామనాథం టీడీపీకి వెళ్లి మరీ వైసీపీని ఓడించారు) మళ్లీ పార్టీ పగ్గాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు రామనాథంకు ఏలూరిని ఢీ కొట్టే సత్తాలేదని డిసైడ్ అయ్యి… చీరాలలో నాయకత్వం కోసం కోట్లాడుకుంటోన్న ఎమ్మెల్యే కరణం బలరాం లేదా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లలో ఎవరో ఒకరిని ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా పెట్టాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ ఎప్పటకి ఇక్కడ ఏలూరికి సరైన ప్రత్యర్థిని సెట్ చేస్తాడో ? చూడాలి.