కొత్త చట్టం వల్ల పరిశ్రమలు రావని… దాని వల్ల ఉద్యోగాలు కూడా పోతాయన్న అపోహలను ప్రతిపక్ష పార్టీ సృష్టిస్తోందని సీఎం మండిపడ్డారు.
వైఎస్ జగన్.. ఆయన ముఖ్యమంత్రి అయి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు కానీ.. ఏపీ రూపురేఖలు మాత్రం మారిపోతున్నాయి. ఏపీని రెండు భాగాలుగా విభజిస్తే… వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ముందు.. కావడానికి తర్వాత అని చెప్పుకోవచ్చు.
ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పన చట్టాన్ని శాసన సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ చట్టంపై ప్రతిపక్ష పార్టీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త చట్టం వల్ల పరిశ్రమలు రావని… దాని వల్ల ఉద్యోగాలు కూడా పోతాయన్న అపోహలను ప్రతిపక్ష పార్టీ సృష్టిస్తోందని సీఎం మండిపడ్డారు.
చట్టాన్ని శాసనసభ ఆమోదించిన తర్వాత మాట్లాడిన సీఎం జగన్.. స్థానికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే ఈ చట్టాన్ని తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఏ కంపెనీ అయినా స్థాపించేటప్పుడు.. ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంటేనే స్థానికులు సహకరిస్తారని సీఎం తెలిపారు.
అయితే… ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల ప్రజలు తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని.. అటువంటి వాళ్లకు పునరావాసంలో భాగంగా అదే కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకువచ్చామని జగన్ స్పష్టం చేశారు.
మంచిగా చదువుకున్న యువత.. ఇతర రాష్ట్రాలు, దేశాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదని… స్థానికంగానే ఉద్యోగాలు చేసుకునే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం ప్రకారం… పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే.. మూడేళ్లలో కల్పించాలని ఈ చట్టంలో ఉంటుందన్నారు.