ఔను.. వైసీపీ నేతలు అందరికీ కలిపి మూకుమ్మడిగా.. ఓ ప్రకటన విడుదలైందా? నేరుగా ఓ కీలక విష యంలో ముఖ్యమంత్రి జగన్ కార్యాలయమే జోక్యం చేసుకుందా? అంటే.. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం బట్టి.. ఔననే చెబుతున్నారు పరిశీలకులు. ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఉదంతంలో తలనొప్పి ఎదుర్కొంటోంది. అదేసమయంలో ప్రభుత్వం తీసుకుం టున్న కీలక నిర్ణయాలపై టీడీపీ ప్రేరేపిత కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. దీంతో సీఎం జగన్ నిర్ణయాలు సాకారం కావడం కనాకష్టంగా మారిపోయింది.
ఈ పరిణామాలతో ప్రభుత్వం ఒకవైపు తలనొప్పి ఎదుర్కొంటుంటే.. పార్టీలో రెండు విధాల జరుగుతున్న పొరపాట్ల కారణంగా.. మరింతగా ప్రబుత్వం ఇరుకునపడుతోంది. ఒకటి.. హైకోర్టు తీర్పులకు సంబంధించి .. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. కొందరు అత్యుత్సాహంతో కోర్టుకు వ్యతిరేకంగా న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. నిజానికి సీఎం జగన్ కు ఈ విషయాలు తెలియవు. పార్టీపై అభిమానంతో కావొచ్చు.. లేదా ప్రబుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నా యనే ఆవేదనతో కావొచ్చు.. హైకోర్టు తీర్పులపై మాత్రం కామెంట్లు పెడుతున్నారు.
ఫలితంగా వీటిపైనా కేసులు నమోదు కావడం.. హైకోర్టు ఏకంగా సీబీఐని రంగంలోకి దింపడం.. వంటివి చేసింది. ఇక, రెండో కారణం.. రాష్ట్రంలో ఇసుక ను అధికార పార్టీ నేతలే తినేస్తున్నారని, కోట్లు సంపాయిం చే సుకుంటున్నారని ఆరోపిస్తూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే రోడ్డెక్కడం. ఇది మరింతగా జగన్‌కు తలనొ ప్పిగా మారిపోయింది. నిజానికి ప్రతిపక్షం ఆరోపణలు చేస్తే.. ఎదురు దాడి చేయాల్సిన అధికార పక్షం.. ఇలా వ్యవహరించడం మరింత ఇబ్బందికరంగా మారింది.
దీంతో ఆయా అంశాలపై జగన్ తాజాగా సీరియస్ అయ్యారని, వైసీపీ నేతలు ఎవరూ కూడా హద్దులు మీరవద్దని.. ఆయన నేరుగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారని..సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు రోడ్డున పడతామంటే..పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.