జగన్ స్టైలే వేరు.. వారసత్వం, డబ్బు కాదు.. దక్షత కావాలి

-

ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త రాజకీయ నిర్మాణానికి, రోల్ మోడల్ రాజకీయ వ్యవస్థకు తెరలేపారు ఏపీ సీఎం వైఎస్ జగన్. రాజ్యాధికారం వారసత్వం, డబ్బు, అనుభవం, పలుకుబడి వంటి మాటలకు చెక్ పెట్టి సరికొత్త రాజకీయ విప్లవానికి తెరదీస్తున్నారు. అతి సామాన్యుడికి కూడా అందలం ఎక్కించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎదురు వారికి ప్రజాసేవ చేసే సామర్థ్యం ఉందా.. అన్న ఒక్క క్వాలిఫికేషన్ నే చూసి వారికి తగిన విధంగా గుర్తింపు గౌరవాలను ఇస్తుండటం ఉద్ధండులైన రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యం గొలుపుతుంది. ఇన్నాళ్లు రాజకీయాలు ఒక పంథాలో నడిచాయి. పార్టీని అధినేతను అంటిపెట్టుకొని ఉంటేనే అమాత్యులు కావచ్చు అనే నానుడికి చెక్ పెట్టారు వైఎస్ జగన్.

 

అయితే తాజాగా ఏపీలో మంత్రివర్గం విస్తరణలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే అందుకు సాక్ష్యం. శ్రీకాకుళం జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికే ఉద్దానం కిడ్నీ పరిష్కార బాధ్యతను భుజానికెత్తుకున్న వైఎస్ జగన్.. రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు ఆస్పత్రి నిర్మిస్తున్నారు. మత్స్యకారుల వలసలు తగ్గించేందుకు జెట్టీ, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రవాణా, ఎగుమతుల కోసం భావనపాడు పోర్టు నిర్మాణానికి చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు.

అదేవిధంగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో తొలి కేబినెట్‌లోనే బీసీ వర్గాలకు ఇద్దరి నేతలకు సదావకాశం కల్పించారు. స్పీకర్‌ గా ఒకరు మరొకరు మంత్రిగా చేశారు. అంతటితో ఆగకుండా మరో వెనకబడిన వర్గానికి చెందిన విద్యావంతుడికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మత్స్యకార కుటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి కట్టబెట్టడంతో సిక్కోలుకు రాజకీయంగా, అధికారికంగా అగ్రస్థానం వేసినట్లైంది. దీంతోపాటే మంత్రి కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవించడం విశేషం. అనుభవం, ప్రజాసేవ చేయాలనే తపన కొలమానాలుగా జగన్ టీంను ఎంచుకుంటున్నారు.

వెనకబడిన వారిలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్ పాటుపడుతున్నారు. అసలు ఉత్తరాంధ్రలో ఇంతవరకు మత్స్యకార సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చిన సన్నవేశాలు చరిత్రలో లేవు. ఆ చరిత్రను కొత్తగా రాశారు వైఎస్ జగన్. వెనుక బడిన సామాజిక వర్గ నేత, కొత్త రక్తం సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చి బీసీలపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని మరోసారి గుర్తుచేశారు. ఇప్పటికే బీసీకి చెందిన తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా చేశారు. మరో బీసీ వర్గానికి చెందిన ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రిని చేశారు.

అంతేకాకుండా మృధు స్వభావి… సౌమ్యు డు.. ఇతరులకు సహాయపడాలనే మంచి మనసున్న వ్యక్తి.. వివాద రహితుడైన ధర్మాన కృష్ణదాస్‌ను రాజకీయంగా ముందుకు నడిపించే శక్తులు. ఏ స్థాయిలో ఉన్నా సామాన్యుడిగా నడవడమే తనకిష్టం. పార్టీ పట్ల వినయం, అధినేతపై విధేయత ఆయన్ని ఉన్నత స్థానానికి చేర్చాయి. అభిమానించే నేత కోసం ఎమ్మెల్యే పదవిని కూడా తృణపాయంగా వదిలేసి, కష్టాల్లో అండగా నిలిచి తాను కష్టాలను చవి చూసి రాజకీయంగా ఎదురీదిన నేతగా జిల్లాలో తనకంటూ ఓ చరిత్ర ఉంది. అదే ధర్మాన కృష్ణదాస్ ను రాజకీయంగా ఉపముఖ్యమంత్రి స్థానం అలంకరించేలా చేశాయి. అన్నదమ్ములు చేపలపట్టి చదివించిన అప్పలరాజు ఈ స్థితికి చేరుకోవడం నిజంగా ఆనందానికి అవధులు లేవు అంటోంది వారి కుటుంబం. అలా అంచలంచలుగా ఎదిగిన అప్పలరాజు ప్రస్థానం అభినందనీయం.

Read more RELATED
Recommended to you

Latest news