మనది ప్రజల పార్టీ.. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం : వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల ఇవాళ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని…కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం… అదే పార్టీ రాజ్యాంగమని వెల్లడించారు.

తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదనీ…వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా… పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలనీ పేర్కొన్నారు. ప్రజలందరి భాగస్వామ్యం మనకు అవసరమని…ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా మన విధానాలు ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి కష్ట సుఖాలను కార్యకర్తలు తెలుసుకోవాలనీ పిలుపు ఇచ్చారు. మన పార్టీ ప్రజల పార్టీ అని…ప్రతీ తెలంగాణ బిడ్డా మన ఎజెండా చూసి మెచ్చుకోవాలనీ పేర్కొన్నారు. వైఎస్ ఆర్ కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్ళాలి… వారి వివరాలు, ఇష్టాలు, సమస్యలు తెలుసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. వాట్సాప్ నంబర్ లో మీ అభిప్రాయాలు చెప్పాలని..ఇప్పటి కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు అని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.