కేసీఆర్‌పై ఫైర్.. డిమాండ్లు మొదలు పెట్టిన ఈటల

-

ఇల్లంతకుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. వావిలాల, చల్లూరును మండలాలు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. గతంలో హుజురాబాద్‌ను జిల్లా చేయాలని కోరారని, కానీ పట్టించుకోలేదన్నారు. నిరోద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, ప్రతి పెద్ద గ్రామపంచాయతీలకి రూ. కోటి, చిన్న గ్రామ పంచాయతీలకి రూ.50 లక్షల నిధులు విడుదల చేయాలని కోరారు.

‘‘జిల్లా, మండల పరిషత్‌లను నిర్వీర్యం అయ్యాయి. పెన్షన్లను వెంటనే విడుదల చేయాలి. గొర్రెల మందపై తొడేళ్లు పడ్డ చందంగా వస్తున్నారు. ఎంపీటీలు, జడ్పీటీలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పచ్చగా ఉన్నాం. చిచ్చు పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. నేను పార్టీ పెట్టలేదు.  పార్టీని విడిచిపెట్టలేదు. నన్ను బహిష్కరించారు. ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని చూస్తున్నారు. చూస్తూ ఊరుకోం. మిమ్మల్నే బొందపెడతాం. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగులు సమయమొచ్చినప్పుడు బుద్ధి చెబుతారు. ఎన్నికలు వస్తే గెలిచితీరుతాం. జెండా, పార్టీని ప్రజలు చూడటంలేదు. ఈటలను గెలిపించుకోవాలనినుకుంటున్నారు.’’ అని ఈటల అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news