కృష్ణ కెరియర్లో సరిదిద్దుకోలేని తప్పులు ఇవేనా..?

-

సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ కాలంలోనే కృష్ణ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇక కృష్ణ ధైర్యానికి ఆయన అభిమానులు సైతం ఫిదా అవుతుంటారు. ఇక ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలలో నటించి ఎన్నో వాటిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణ. అయితే ఇలాంటి కృష్ణ తన కెరియర్ లో కొన్ని తప్పులు చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ కావడం కోసం చాలా కలలు కనింది. కానీ ఆమెను హీరోయిన్ ను కాకుండా కృష్ణ ఆపివేశారట. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే కృష్ణ ఎస్పీ బాలసుబ్రమణ్యం తో వ్యవహరించిన తీరు కూడా సినీ ఇండస్ట్రీలో కొంతమందికి నచ్చలేదు అన్నట్టుగా వార్తలు గతంలో బాగా వినిపించాయి. ఎవరూ చెప్పిన మాటలు వినడం వల్లే ఈ హీరో బాలసుబ్రమణ్యం తో కాస్త విభేదాలు ఏర్పడ్డాయని సమాచారం.

డైరెక్టర్ రేలంగి నరసింహారావు.. హీరోగా శోభన్ బాబుతో కలిసి ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ డైరెక్టర్ తోనే కృష్ణ ఒక సినిమా చేస్తానని చెప్పి మాట కూడా ఇచ్చాడట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ రేలంగి తప్పు లేకున్నా సరే కృష్ణ ఆయనపై ఫైర్ అయ్యారట. ఇలా చిన్న చిన్న తప్పులు చేసుకుంటూనే కృష్ణ చాలా ఇబ్బందులు పడినట్లుగా తెలుస్తోంది.

ఇక నిర్మాత రామానాయుడు కృష్ణ రీ శోభన్ బాబు హీరోలుగా ముందడుగు సినిమాలో నటించారు.ఇక వీరి కలయిక లోనే మరొక సినిమా చేయాలని రామానాయుడు కోరాడట. కానీ కృష్ణ మాత్రం దర్శకుడుగా రాఘవేంద్రరావు ఉండాలి అని పరుచూరి బ్రదర్స్ ఉండకూడదని కండిషన్ లు పెట్టారు.. ఈ విషయానికి కూడా రామానాయుడు ఒప్పుకున్నారు కానీ కృష్ణ వేరే నిర్మాతలతో కమిట్ అవ్వడం వల్ల.. ఆ సినిమాని వదులుకోవడంతో రామానాయుడు హర్ట్ అయి ఆ సినిమాను పక్కన పెట్టేసి వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కృష్ణ ఇలాంటి తప్పులు చేయడంతో అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారింది మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే కృష్ణ నే స్పందించాలి.

Read more RELATED
Recommended to you

Latest news