తరచూ తలనొప్పి, వాంతులు బ్రెయిన్‌ ట్యూమర్‌ సంకేతమే..!

-

మెదడుకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా అది మొత్తం మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండెజబ్బుకంటే ప్రమాదకరం.. గుండెపోటు వస్తే స్టంట్‌లు వేసి ఎలాగోలా గండం నుంచి గట్టెకించవచ్చేమో కానీ..బ్రెయిన్‌లో సమస్యను అంత ఈజీగా పరిష్కరించలేం..మెదడుకు సంబంధించి వైద్యులు కూడా అంత ఎక్కువగా ఉండరు. మాములుగా బాడీలో ఎక్కడ కణితులు వచ్చినా సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ఒకవేళ అవే కణితులు బ్రెయిన్‌లో వస్తే..శరీరంపై అయితే చూసి గుర్తుపట్టొచ్చు. బ్రెయిన్‌లో అలా కాదు.. అవి ఇంతై ఇంతింతై అన్నట్లు పెద్దవయ్యాక గానీ మ్యాటర్‌ బయటపడదు. అలాంటప్పుడు అది ప్రాణాలకే ముప్పు. బ్రెయిన్‌లో కణితుల్ని గుర్తించడం ఎలా..? వీటి లక్షణాలు ఏంటో చూద్దాం.
మెదడులో ఏర్పడే కణితులు క్యాన్సర్లు కావొచ్చు..కాకపోవచ్చు. కానీ, అవి ప్రమాదకరంగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కణితులు మెదడులో ఏర్పడినపుడు ముందుగానే కనుగొనే వీలుంది.
మెదడులో కణితులు పురుడు పోసుకునే సమయంలో తరచు తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది.
తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతాయి. ఇలా తరచుగా వచ్చే తలనొప్పిని, వాంతులు అవుతుంటే.. వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉన్నట్టుండి మూర్ఛ వచ్చినా కణితుల సంకేతాలేనని మరచిపోవద్దు.
మాట స్పష్టత లోపించడం, ఎప్పుడూ మగతగా ఉండటం, మింగడంలో ఇబ్బందిగా ఉంటుంది. చూపులో తేడాలున్నా ఆసుపత్రికి వెళ్లాల్సిందే.

ఎవరికి ప్రమాదం ఎక్కువ..?

ఎవరికైనా మెదడులో కణితులు రావొచ్చు.. ఏ వయసులోనైనా రావొచ్చు. మెదడు కణితులు పెద్దవాళ్లలో కాస్త తక్కువే అనుకోవచ్చు. మొత్తం కణితుల్లో ఇవి 1-2 శాతమే. కానీ పిల్లల్లో తరచూ చూస్తుంటాం. ఇవి ఎందుకు ఏర్పడతాయన్నది కచ్చితంగా చెప్పలేరట.. కొన్నిరకాల కణితులకు ఆయా జన్యువుల్లో మార్పులు కారణం కావొచ్చని వైద్యులు భావిస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వంటివి అతిగా వాడటం వల్ల మెదడులో కణితులు వస్తాయని అనుకుంటుంటారు గానీ ఇది నిజం అని ఇంకా నిరూపణ కాలేదు. బ్రెయిన్‌ ట్యూమర్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మనకే ముప్పు..న్యూరో సర్జన్‌ను సంప్రదించి సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news