ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అయితే.. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన షర్మిల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ నేడు రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. వైఎస్ షర్మిల నేటి ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలవనున్నారు. రాజ్‌భవన్‌కు వెళ్లనున్న వైఎస్ షర్మిల.. గవర్నర్‌ను కలిసి తనపై దాడి, అరెస్టు తదితర వివరాల గురించి ఫిర్యాదు చేయనున్నారు.
ఇదిలాఉంటే.. షర్మిలను అరెస్ట్ చేసిన తీరును గవర్నర్ తమిళిసై ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు, ఆ కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్వీట్ చేశారు. వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి వైఎస్ షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.