మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ ఇద్దరూ దోచుకునే దోస్తులేనని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఏ ప్రాజెక్టు చేపట్టినా ‘మెగా’కే ఇస్తుండు.ఇన్నాళ్లు ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఏనాడు దీనిపై ప్రశ్నించలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కి తమ వంతు వాటా దక్కుతోంది కాబట్టే గొంతెత్తడం లేదని పేర్కొన్నారు.
మునుగోడు లో ఉప ఎన్నికలు వాళ్ల స్వార్థం కోసమే వస్తున్నాయని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఇష్టం వచ్చినట్లు రాజీనామాలు చేయడం, నచ్చిన పార్టీలోకి రావడం వల్లనే ఎన్నికలు వస్తున్నాయన్నారు.
వీళ్లకు కోట్లలో ఫైన్ వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కెసిఆర్ నిర్లక్ష్యం వల్లే భద్రాచలం ముంపుకు గురైందన్నారు షర్మిల. ముఖ్యమంత్రి అయిన కొత్తలో భద్రాచలానికి వచ్చిన కేసీఆర్.. మళ్లీ మొన్నటి వరదలకు అదికూడా వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత తీరిక చేసుకుని వచ్చారని అన్నారు. వచ్చినా కూడా ఎవరిని పరామర్శించరలేదని, బాధితులతో మాట్లాడలేదని అన్నారు.
మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్ ఇద్దరూ దోచుకునే దోస్తులే. అందుకే ఏ ప్రాజెక్టు చేపట్టినా ‘మెగా’కే ఇస్తుండు.ఇన్నాళ్లు ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఏనాడు దీనిపై ప్రశ్నించలే. రేవంత్ రెడ్డికి, బండి సంజయ్ కి తమ వంతు వాటా దక్కుతోంది కాబట్టే గొంతెత్తడం లేదు. pic.twitter.com/tzvpHNb701
— YS Sharmila (@realyssharmila) July 25, 2022