బరువు తగ్గాలంటే ఉపవాసం చేస్తే చాలు అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. ఇది అంత మంచి పద్దతి కాదు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అంటే చల్తా కానీ..అదే పనిగా ఉద్యమం చేసినట్లు ఉపవాసం పేరిట కడుపు మాడ్చుకంటే ఒంట్లో గ్లూకోజు తగ్గి మధుమేహం బారినపడే అవకాశం ఉంటుంది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్లు అవుతుంది. అసలు మధుమేహం ఉన్నవారు ఉపవాసాలు చేయొచ్చా..? పరిశోధనలు ఏం చెప్తున్నాయి.
మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్’ అంటారు. పిండిపదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంది..
ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్’ అనేది బాగా పెరిగిపోతుంది.. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడుతుంది. ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్, ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్ అనే ఆమ్ల పదార్థాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్ బోడీస్’ అంటారు. శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తారు.
ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటమే మంచిది. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చేయొచ్చని పరిశోధకులు అంటున్నారు. త్వరలో మధుమేహం వస్తుందని మాకు ఎలా తెలుస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు.. అధికబరువు ఉన్నట్లేతే మీకు త్వరలో మధుమేహం వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి ఆ బరువు తగ్గించుకోవడమే మీ ప్రధమ కర్తవ్యం.!
Attachments area