చిన్న దొరా అంటూ కేటీఆర్ పై షర్మిల సెటైర్ల వర్షం…!

-

తాము ఇచ్చిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు పది ఇందిరమ్మ ఇళ్లకు సమానమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పై వైఎస్ షర్మిల స్పందిస్తూ సంచలన ఆరోణలు చేసింది. మీ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు 10 ఇండ్లతో సమానమా? మరి 10 కుటుంబాలను ఒక్క డబుల్ బెడ్రూం ఇంట్లనే కాపురం ఉండమని చెప్పకపోయావా చిన్న దొరా? అంటూ కేటీఆర్ పై షర్మిల సెటైర్ లు వేసింది. ఎందుకంటే మీకు కుటుంబానికి ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు ఇయ్యడం చేతకాదు కదా అంటూ వ్యాఖ్యానించింది. మీకు ఇంటికొక ఉద్యోగం ఇయ్యడం చేతకాదు కదా…అంటూ షర్మిల విమర్శలు కురిపించింది.

మీకు మూడు ఎకరాల భూమి ఒక్కొక్క దళిత కుటుంబానికి ఇయ్యడం చేతకాదు కదా..అంటూ షర్మిల మండి పడింది. అంతే కాకుండా మీకు రుణమాఫి చెయ్యడం చేతకాదు కదా..అంటూ షర్మిల వరుస ప్రశ్నలు వేస్తూ విమర్శలు కురిపించింది. మీకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం చేతకాదు కదా .. మీకు వడ్లు కొనడం చేతకాదు కదా అంటూ వ్యాఖ్యానించింది. మరి పాలన మానేసి ధర్నాలే చేసుకొండి. రాజీనామా చేసి ఒక దళితున్ని సీఎం చేయండి అంటూ షర్మిల కేటీఆర్ పై మరియు టిఆర్ఎస్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news