వైయస్ విజయమ్మ ఆత్మీయ సమావేశం వెనక రహస్య ఎజెండా?

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ ఆత్మీయ సమావేశంపై విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారనే విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రులు సహా ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు, విభిన్న రాజకీయ వర్గాల నుండి, పార్టీల నుండి వస్తున్న వారు సమావేశానికి హాజరు అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది రాజకీయ సమావేశంగా మారనుందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగానలో వైయస్ఆర్ టీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీకి వైయస్ షర్మిల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటు మరికొందరేమో, ఆత్మీయ సమావేశంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.