ఆనందయ్య మందు వెబ్ సైట్ లు నమ్మొచ్చా…?

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆనందయ్య మందు విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు. నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి కొందరు సొమ్ము చేసుకోవాలని చూడటం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఆనందయ్య మందు తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఆనందయ్యదే అని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వానికి, వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అని అన్నారు. వస్తు రూపంలో ఇవ్వాలని అనుకున్నవారు, ఆర్థిక సహాయం అందించాలనుకున్న వారు నేరుగా ఆనందయ్యకు తప్పించి, మధ్యలో ఎంతటివారినైనా నమ్మి ఇవ్వవద్దు అని ఈ సందర్భంగా కోరారు.