విశాఖ.. ఏపీ రాజధాని అని, నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నానని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… త్వరలోనే విశాఖ…. ఏపీ కాపిటల్ కాబోతుందని సీఎం జగన్ ప్రకటించారు. తాను కూడా అక్కడికి షిఫ్ట్ కాబోతున్నానని వివరించారు.
పారిశ్రామికవేత్తలను విశాఖకు ఆహ్వానిస్తున్నామని… ఏపీ 12% వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. ఇక్కడ సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సీఎం జగన్ వివరించారు. “రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా” అంటూ సీఎం జగన్ వెల్లడించారు.
విశాఖ ఏపీ రాజధాని, నేను కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నా – సీఎం జగన్ #APGIS2023#BuildAP#InvestmentsInAP#YSJaganDevelopsAP pic.twitter.com/v8ZFU7TLWz
— The Jagannaut (@TheJagannaut) January 31, 2023