ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ ఆసరా పథకం కింద ఏకంగా 78.76 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. ఇక ఈ పథకం అమలుకు ఈ ఏడాది రూ. 6439 కోట్లు కేటాయించింది జగన్ సర్కార్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఈ నెల 18 వరకు ఆసరా ఉత్సవాలు జరుపుతామన్నారు.
ప్రతి మహిళను అమ్మవారి గా, శక్తి స్వరూపిణి గా భావించే నవరాత్రుల ప్రారంభం రోజున అక్క, చెల్లెమ్మలను కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. వై.ఎస్.ఆర్. ఆసరా రెండో విడత మహిళా సంఘాలకు జమచేసే కార్యక్రమం పది రోజులు జరుగుతాయని వెల్లడిచారు. కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో నవంబర్ ఆరు నుంచి మహిళా సంఘాలకు నగదు జమ చేస్తామని తెలిపారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో మహిళా సంఘాలకు నగదు జమ చేసిన ఘనత వైసీదేనన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు.