ఈ నెల 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు వైఎస్‌ఆర్ చేయూత పథకాన్ని నిర్వహిస్తామని.. ఈ కార్యక్రమాన్ని కుప్పంలో సీఎం జగన్ ప్రారంభిస్తారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించారు. కుప్పంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ…. అమరావతి ప్రాంత వాసులది రైతు యాత్ర కాదు… కోటీశ్వరుల యాత్ర అని విమర్శలు చేశారు.

40 వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు కుప్పంలో గెలుస్తూ వచ్చాడు… బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచిన చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని ఆగ్రహించారు. కుప్పంలో వైసిపి జెండా ఎగరాలి… కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా ఓడించి, లోకల్ గా ఉంటున్న భరత్ ను గెలిపించాలి. భరత్ గెలిస్తే మంత్రి అవుతారన్నారు. జగన్ పరిపాలనలో ప్రజలు మేల్కొన్నారు… 22న సీఎం జగన్ కుప్పం పర్యటన విజయవంతం చేయండని కోరారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. కుప్పం నుండి సీఎం చేతుల మీదుగా చేయూత కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు.