సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన `వైఎస్ఆర్ నవోదయ` పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఏపి సిఎం జగన్ ఈరోజు ‘వైఎస్‌ఆర్ నవోదయ’ పథకాన్ని ప్రారంభించారు. సుమారు 80,000 యూనిట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.