రైతులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. రైతులు సాగు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించనుంది. అందుకు నిధులను కూడా విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. స్వయంగా సీఎం వైఎస్ జగన్ రైతుల ఖాతాల్లో నిధులను విడుల చేశారు. పెట్టుబడి సాయం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తప్పనున్నాయి.
రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత నిధులను విడుదల చేసింది. రైతు ఖాతాల్లో జమయ్యేలా నిధులను విడుదల చేసింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ లో 50.58 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రూ. 1036 కోట్లు రైతులకు అందనున్నాయి. ఈ పథకం కింద ఏటా రూ. 13500 కోట్లను ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రభుత్వం మే నెలలో రూ. 7500 కోట్లు, అక్టోబర్ లో రూ. 4000 కోట్లను, జనవరిలో రూ. 2000 కోట్లను ఇస్తోంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ రోజు సాయంత్ర ప్రధాని మోదీని కలవనున్నారు. రాష్ట్రంలో సమస్యలు, పరిస్థితులపై ప్రధానికి వివరించనున్నారు.