వైకాపా రంగుల పైత్యం ఎక్కువైంది గురూ .. !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరవేసే ప్రతి దాని విషయంలో పబ్లిసిటీ స్టంట్ ఉపయోగించేది. రంజాన్ చంద్రన్న కానుక సంక్రాంతి చంద్రన్న కానుక అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బొమ్మలను వేస్తూ ప్రచార కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం కూడా అదేరీతిలో వ్యవహరిస్తోంది.Too much late decision by Court and EC favours Jagan ...ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయం పార్టీ జెండా రంగులు వేయటం తో పాటుగా ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా రంగులు వేయటం తో ఇటీవల కొంతమంది కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం జగన్ సర్కార్ కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇదిలావుండగా ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ ఉన్న తరుణంలో వైకాపా రంగుల పైత్యం మరీ ఎక్కువైంది.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే ప్రజలకు వైసిపి పార్టీ రంగుల తో ఫేస్ మాస్కులు, అదేవిధంగా కరోనా బాధితులకు వైసీపీ జెండా రంగులతో ‘కిట్లు’ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వైసిపి స్థానిక నాయకులు పంచుతున్నారు. దీంతో చాలా మంది సామాన్య జనులు వీళ్ళకి ఇంకా పైత్యం పోలే గురు అంటూ మండిపడుతున్నారు. ఇటువంటి టైములో మానవత్వాన్ని చాటించల్సింది పోయి ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయటం ఒక్క వైకాపా కె చెందుతుందని ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news