పవన్‌ను జాతి క్షమించదు : అంబటి రాంబాబు

-

పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేనతో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ, ప్రతి చోటా సోషల్ ఇంజినీరింగ్ జరగాలని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. సంఖ్యా బలం ఉన్న కులాల మధ్య ఐక్యత లేకపోతే అధికారం దక్కదని, రాజకీయ బలం లేని కులాలకు రాజ్యాధికారం చేజిక్కించుకోలేవని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకు తాకట్టుపెట్టడమే పవన్ సోషల్ ఇంజినీరింగ్ అనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలా చేస్తే పవన్ ను జాతి క్షమించదని అంబటి రాంబాబు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

పేర్ని నాని కూడా ఈ విషయం లో పవన్ పై స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుక‌కు న‌రం ఉండ‌ద‌ని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదని నాని విమ‌ర్శించారు. కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లు కలిస్తే ఈ ప్రభుత్వం మారిపోతుంద‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎందుకు మారాలి? ఎవరి చేతుల్లోకి అధికారం వెళ్ళటానికి మారాల‌ని నాని ప్ర‌శ్నించారు. తన లబ్ది కోసం, ఆనందం, తృప్తి కోసం ప్రజలు ఏమైపోయినా పవన్ కళ్యాణ్ కు పర్వాలేదని నాని విమ‌ర్శించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు విప్పితే అబద్ధాలని నాని విమ‌ర్శించారు. ప‌వ‌న్ నాన్న కాపు, అమ్మ బలిజ అని కొత్తగా చెబుతున్నాడని, రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తాడని నాని విమ‌ర్శించారు. ప్రజాసేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నీకు కులంతో ఏం పని అని నాని ప్ర‌శ్నించారు. ప్రజా నాయకులకు కులంతో పని ఉండదని నాని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news