కేంద్ర మంత్రులుగా వైసీపీ ఎంపీలు…!

-

ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పావులు క‌దుపుతున్నారా..? అంటే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీకి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో..ఇది రాజ‌కీయంగా ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ని, పైగా కేంద్రంతో దోసి క‌డితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా పెరుగుతాయ‌నే బ‌హుముఖం వ్యూహంతో బీజేపీ వైపు వైసీపీ అడుగులు వేస్తున్న‌ట్లు చ‌ర్చ సాగుతోంది. అంతా అనుకున్న‌ట్లుగా జ‌రిగితే త్వ‌ర‌లోనే అమిత్‌షా, మోదీని జ‌గ‌న్ క‌ల‌వ‌నున్నార‌ని స‌మాచారం.

అయితే రాష్ట్రంలో పార్టీని విస్త‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అభిప్రాయంతో ఎంత‌మాత్రం అంగీకారం తెలుపుతుంద‌నేది సందేహ‌స్ప‌ద‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జ‌గ‌న్‌తో పొత్తుపొట్టుకోవ‌డం వ‌ల్ల బీజేపీకి కొత్త‌గా ఒరిగే ప్ర‌యోజ‌న‌మైతే ఉండ‌దు. లాభం చేకూరేది బీజేపీకే.పైగా పార్టీ విస్త‌ర‌ణ‌కు వైసీపీయే అడ్డు అన్న‌ట్లుగా రాష్ట్ర బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే అధిష్ఠానానికి నివేదిక ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిపాద‌న‌ను బీజేపీ ఒకే చేస్తుందా అంటే కొంత అనుమానాస్ప‌ద‌మేనని చెబుతూనే..చెప్ప‌లేం బీజేపీ గ్రాఫ్ త‌గ్గుతున్న నేప‌థ్యంలో చేర‌దీసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటూ కొంత‌మంది విశ్లేషిస్తున్నారు. ఎన్నిక‌ల నాటి నుంచే ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన వైసీపీ పలుమార్లు విజ‌య‌సాయిరెడ్డి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినా అవున‌న‌కా..కాద‌న‌కా..విష‌యాన్ని పెండింగ్‌లో పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఒక‌వేళ పొత్తు కుద‌రితే రాష్ట్రానికి కొద్దిమేర నిధులు ద‌క్క‌డంతో పాటు క‌నీసం ఒక్క కేంద్ర‌మంత్రి ప‌ద‌వైనా వ‌స్తుంద‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. అదేస‌మ‌యంలో బీజేపీతో దోస్తీ కార‌ణంగా కేంద్రంలో వైసీపీకి బ‌లం ఉంద‌న్న సంకేతం జ‌నంలోకి వెళ్లి పార్టీ వ‌ర్గాల్లోనూ మ‌నోధైర్యం ఏర్ప‌డుతుంద‌ని, అంతిమంగా పార్టీకి ఇది ఇతోధికంగా ప్ల‌స్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరనే నానుడి ఉండ‌నే ఉంది. వైసీపీ ద‌గ్గ‌ర‌వుతున్న వేళ‌.. బీజేపీని బుట్ట‌లో వేసుకోవాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు ప‌రిస్థితి.. అమిత్‌షా అంటో త‌న‌కెంతో గౌర‌వ‌మంటూ ప్రేమ ఒల‌క‌బోస్తున్న ప‌వ‌న్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారోన‌న్న చ‌ర్చ మొద‌లైంది.

Read more RELATED
Recommended to you

Latest news