ధనుష్-సాయి పల్లవి `రౌడీబేబీ` సాంగ్ కొత్త రికార్డు..

-

కోలీవుడ్‌ హీరో ధనుష్‌, సాయి పల్లవిల కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రౌడీ బేబీ పాట యూట్యూబ్ వ్యూస్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకూ 725 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ రికార్డుల్లో 7 స్థానాన్ని స్వంతం చేసుకుంది.
ధనుష్ స్వయంగా రాసి, పాడిన ఈ పాటకు స్వరకర్త యువన్ శంకర్ రాజా కాగా, అదిరి పోయే స్టెప్పులను అందించారు ప్రముఖ కొరియో గ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా.

‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డులను సృష్టించిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం. కాగా బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించిన మారి-2లో టోవినో, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, కృష్ణలు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక మారి మొదటి పార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద అంతగా రాణించకపోయినా సీక్వెల్‌ మాత్రం తమిళంలో భారీగానే కలెక్షన్లు రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news