రాజకీయాల్లో ఎప్పుడైనా వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఉంటాయని చెప్పొచ్చు…ఏ నాయకుడైన ఒక వ్యూహం వేసి ప్రత్యర్ధికి చెక్ పెట్టాలని అనుకుంటే…ప్రత్యర్ధి అంతకుమించిన పదునైన వ్యూహంతో చెక్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు…ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది..ఎలాగైనా అధికార వైసీపీకి చెక్ పెట్టాలని ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమా భీమ్లానాయక్‌ని ఒక అస్త్రంగా వాడుకుంది.
భీమ్లా సినిమాకు అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వని సంగతి తెలిసిందే..అలాగే టిక్కెట్ల రేట్లు పెంపుకు కూడా సహకరించలేదు..ఎక్కడైనా అదనపు షోలు వేసిన, ఎక్కువ ధరలకు అమ్మిన కఠిన చర్యలు తీసుకునేలా జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది…రెవెన్యూ అధికారులు, పోలీసులని థియేటర్ల వద్ద కాపలా పెట్టింది. ఇక ఈ పరిణామాలపై పవన్ ఫ్యాన్స్..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో టీడీపీ సైతం..పవన్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ..జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయింది..చంద్రబాబు, లోకేష్‌లు సైతం భీమ్లాపై స్పందించి..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అంటే ఇక్కడ పవన్‌ని దగ్గర చేసుకోవడం, ఆయన అభిమానుల మద్ధతు పొందడమే టీడీపీ టార్గెట్‌గా ఉందని చెప్పొచ్చు..ఈ విషయం క్లియర్‌కట్‌గా తెలుస్తోంది..అందుకే జగన్ ప్రభుత్వం కూడా అదిరిపోయే వ్యూహంతో ముందుకొచ్చింది..పవన్ కోసం హడావిడి చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌లు ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలవడం, ఆయన సినిమాలకు సపోర్ట్ చేయడం చేసారంటూ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చేశారు. వాస్తవానికి టీడీపీ ఎప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు మద్ధతుగా నిలవలేదు…పైగా ట్రోల్స్ చేశారు.
ఇప్పుడు ఇదే అంశాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టుకున్నారు…పేర్ని నాని మాటలతో టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు…చంద్రబాబుకు పవన్ ఫ్యాన్స్‌తోనే పని ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇక జగన్ ప్రభుత్వం అనూహ్యంగా ఎన్టీఆర్ పేరుని తెరపైకి తీసుకొచ్చి టీడీపీని ఇరుకున పెట్టింది..అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్ధతు వైసీపీకి పెరిగేలా చేసుకుంది.