రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి

-

టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఆ పార్టీ నేత, పి జనార్దన్ రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పై బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాదులో ఓ పబ్ వద్ద మైనర్ బాలికపై సామూహిక హత్యాచారం చేసిన యువకుల ఘటనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ కేసు నమోదు చేశారు.

రేవంత్ రెడ్డి.. అత్యాచార ఘటన జూబ్లీహిల్స్ పరిధిలోని పెద్దమ్మ గుడి ఆవరణలో జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ గుడి ఆవరణలో బాలిక పై అత్యాచారం జరగలేదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తప్పు పట్టారు.

రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆలయ పరిధిలో అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రకటనలు చేసినందుకే తాను రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేశానని తెలిపారు విష్ణువర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news