తండ్రితో అక్రమ సంబంధం.. మహిళను కొట్టి చంపిన అక్కాతమ్ముడు

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్కాతమ్ముడి దాడిలో కన్న తండ్రితో అక్రమ సంబంధం నెరుపుతున్న మహిళ మృతిచెందింది. నవంబర్ 10న తండ్రితోపాటు సానిహిత్యంగా ఉన్న మహిళను అక్కాతమ్ముడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ చితకబాదడంతో మహిళ(50) ప్రాణాలను కోల్పోయింది. ఆ తర్వాత మహిళలకు దగ్గర ఉండి అక్కాతమ్ముడు అంత్యక్రియలు నిర్వహించడం కొసమెరుపు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో అక్కాతమ్ముడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వారిద్దరి వయస్సు 30ఏండ్ల లోపే ఉండటం గమనార్హం.