ఇండియన్ 2 డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ దక్కించుకుందెవరో తెలుసా..?

-

దర్శకుడు శంకర్  దర్శకత్వంలో  కమల్‌హాసన్  టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది .ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఈ సినిమా లో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, బ్రహ్మానందం, స‌ముద్రఖని, మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఇండియన్ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం  నెట్‌ప్లిక్స్ దక్కించుకుంది. ఇండియన్ 2 తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థ్రియాట్రికల్‌ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. ఇండియన్‌ 2 ఆడియో హక్కులను పాపులర్‌ మ్యూజిక్‌ లేబుల్ సోనీ మ్యూజిక్‌ భారీ ధరకు దక్కించున్నట్టు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news