మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సీఎంవో నుంచి… ‘మీకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్‌ను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. తొందరపడి ఖాళీ చేయ కండి’ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల ఓడిపోయిన సం గతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసాల్లో ఉన్న తన క్వార్టర్‌ను ఖాళీ చేయాలని తుమ్మల భావించగా…ఈ సమాచారాన్ని తెలుసుకున్న తెరాస పెద్దలు.. వెంటనే స్పందించినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు త్వరలో రాబోతున్న నేపథ్యంలో.. ఖమ్మం జిల్లాలో సామాజికవర్గ పరంగా అత్యంత కీలకంగా ఉన్న తుమ్మలకు సముచిత స్థానం కల్పించటం ద్వారా విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని వారు భావించారు.
దీంతో అవసరమైతే ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అందువల్లే క్వార్టర్ ఖాళీ చేయొద్దంటూ ఆయనకు ఫోన్ కాల్ వచ్చిందని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖమ్మం జిల్లా మంత్ర వర్గంలో ప్రాధాన్యత కల్పించాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.