వయసు మీద పడుతున్న కొద్ది తన ఫిట్నెస్ ఏ మాత్రం తగ్గలేదని రోజు రోజుకి నిరూపిస్తున్నాడు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.ఈ రన్ మెషీన్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు బంతి అతడిని దాటిపోవడం అసంభవమే. రెండ్రోజుల క్రితమే అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఫీల్డింగ్ ఇందుకు నిదర్శనం. భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ కరీమ్ జనత్ భారీ షాట్ ఆడగా లాంగాన్‌లో కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టి బౌండరీ లైన్ ఆవల పడ్డా బంతిని మాత్రం ముందుకు విసిరడంతో ఐదు రైస్ సేవ్ చేశాడు. ఈ ప్రదర్శనకు గాను కోహ్లీ ‘బెస్ట్ ఫీల్డర్ అవార్డు’ ను సొంతం చేసుకున్నాడు.
బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్.. కోహ్లీకి ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును ప్రకటించిన్నపుడు అక్కడే ఉన్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని అభినందించాడు. టీమ్ మెంబర్స్ చప్పట్లతో ప్రశంసలు కురిపించారు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును అమలు చేసిన సంగతి తెలిసిందే.