సూర్యనికి అర్ఘ్యం ఇవ్వండి విశేష ఫలితం !
మేషరాశి: అనుకూలమైన రోజు, అధిక ధనవ్యయం, దూర ప్రయాణాలకు అవకాశం. రాజకీయ రంగంలో వారికి కలిసి వస్తుంది. మంచి ఫలితాల కోసం ఈశ్వర అభిషేకం లేదా భస్మధారణ చేయండి.
వృషభరాశి: ఆనందం, కార్యజయం, లాభాలు, దూరబంధువుల రాక. పరిహారాలు ఇష్టదేవతరాధన చేయండి.
మిధునరాశి: ప్రతికూల వాతావరణం, ధనవ్యయం, మిత్రుల సహకారం. పరిహారాలు తులసీ దళాలతో విష్ణు/వేంకటేశ్వర ఆరాధన చేయండి.
కర్కాటకరాశి: అనుకూల ఫలితాలు, చేసే పనిలో లాభం, మిత్రలతో కలయిక. పరిహారాలు ఇష్టదేవతరాధన చేసుకోండి.
సింహరాశి: ప్రశాంత వాతావరణం విందులు, వినోదాలు, కుటుంబంలో చిన్నచిన్న ఇబ్బందులు. పరిహారాలు శుక్రగ్రహారాధన లేదా తెల్లని వస్ర్తాలు ధరించండి.
కన్యారాశి: మంచిరోజు, శుభకార్యాలక అవకాశం, విందులు. కొత్తవారి పరిచయాలు. పరిహారాలు భగవన్నామ స్మరణతో మంచి జరుగుతుంది.
తులారాశి: కార్యజయం, అధికారులతో సఖ్యత, అధిక ధనలాభం, బంధుమిత్రుల సహకారం. ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చికరాశి: అనుకూల ఫలితాలు, రాజకీయ రంగంవారికి మంచి జరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు. పరిహారాలు విష్ణు ఆరాధన లేదా స్తోత్ర పారాయణం/శ్రవణం.
ధనస్సురాశి: ప్రతికూలం. అశాంతి, ధనవ్యయం. పరిహారాలు శివునికి తెల్లనిపూలతో ఆరాధన లేదా తెల్ల జిల్లేడు, మారేడుతో పూజించండి తప్పక మంచి జరుగుతుంది.
మకరరాశి: మంచిరోజు. సోదరసోదరీలు ఇంటికి రాక, శుభకార్యాల వల్ల ఖర్చులు. పరిహారాలు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి.
కుంభరాశి: కార్యజయం, కుటుంబంలో సంతోషవాతావరణం, దైవకార్య సూచన. పరిహారాలు ఇష్టదేవతరాధన చేసుకోండి.
మీనరాశి: ఆనందం, చిన్నచిన్న సమస్యలు, బంధువులతో వివాదాలకు అవకాశం. పరిహారం ఇష్టదేవతరాధన, శివపూజ చేయండి.
నోట్: పరిహారాలు చాలా చిన్నవిగా కన్పించవచ్చు. కానీ ఆయా పురాణాలు, శాస్ర్తాలలో పండితులు ఆచరించి లబ్ది పొందినవని గమనించండి. అంతేకాదు ఈ పరిహారాలు సామాన్యులు అంటే ధనాన్ని ఖర్చు పెట్టలేని వారుకూడా లబ్దిపొంది కుటుంబ జీవితాన్ని సుఖంగా గడపడానికి అనుభవజ్ఞులు చెప్పినవాటిని మీకు అందిస్తున్నాం. విశ్వాసంతో ఆచరించండి. ఫలితాలు పొందండి. మీకు లాభం చేకూరిన తర్వాత మాకు మెయిల్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.
ఓం నమో వేంకటేశాయ
-కేశవ