ఫిబ్రవరి 24 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

ఫిబ్రవరి – 24 – మాఘ మాసం – బుధవారం.

 

మేష రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో గొప్ప హోదాలను పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:అప్పుల బాధలు తీరిపోతాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరి ఆదరణ పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల లాభాలు అనుకూలిస్తాయి. శత్రువులు కూడా స్నేహితులవుతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతలు పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత గా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి:ఆరోగ్యంగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:స్నేహితులతో ఆనందంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ యూనివర్సిటీల్లో సీట్లు పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్లు కలుగుతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:సమాజంలో గౌరవ మర్యాదలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ ఉద్యోగులు గా పేరు పొందుతారు, పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు, కార్యసిద్ధి పొందుతారు. మీ మాట తీరు వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.

పరిహారాలుః కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

తులారాశి:బకాయిలను వసూలు చేసుకుంటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అందరితో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. అనారోగ్యాలను పోగొట్టుకొని ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. గృహంలోలో శుభకార్యాన్ని తలపెడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి:అందరినీ ఆకట్టుకుంటారు !

‌ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంటు ఉద్యోగం అవుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. మీలో ఉన్న కోపం వల్ల నష్టం ఏర్పడుతుంది. రహస్యాలను బయటకు చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు.

పరిహారాలుః ఈరోజు విశ్వనాధాష్టకం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి:శత్రువులు మిత్రులు అవుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ఎదుటి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు.

పరిహారాలుః సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

 

మకర రాశి:ఆనందంగా ఉంటారు !

ఈరోజు శుభ యోగంగా ఉంటుంది. అయిన వారితో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ప్రయోగాలు చేస్తారు, విజయం పొందుతారు. కుటుంబంలో శుభకార్యం తలపెడతారు. స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః శివాష్టక పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:గృహాన్ని కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. యాత్రలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు భ్రమరాంబిక అమ్మవారిని ఆరాధించండి.

 

మీన రాశి:ఇంట్లో వేడుకలు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా, సభ్యతగా ఉంటారు. ఇంట్లో వేడుకలు జరుపుతారు. వివాహ నిశ్చయ తాంబూలాలు జరుగుతాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి, లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...