విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

Join Our Community
follow manalokam on social media

విశాఖలో రౌడీ షీటర్ బండ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖపట్నం ఎంవిపి కాలనీ సత్యం జంక్షన్ లోని జయభేరి వద్ద ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి సమయంలో తన ఇంటి బయట కూర్చున్న బండ రెడ్డి అనే వ్యక్తి మీద ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇనప రాడ్డు బండ రెడ్డి తలకు బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయంలో జరిగిన ఈ హత్య విశాఖ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

murder
murder

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపధ్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...