జనవరి 09 శనివారం : రాశి ఫలాలు మరియు పరిహారాలు

జనవరి –  9 – శనివారం – మార్గశిర మాసం.

మేష రాశి: ఈరోజు ధన నష్టం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు అనవసరపు ఖర్చులను పెంచుకోవడం వల్ల ధన నష్టం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడి విద్య మీదనే దృష్టి పెట్టి చదవడం మంచిది. ఈరోజు వ్యాపార వృత్తుల వారికి వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినడం మంచిది, వారిని మోసం చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులను, స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు వివాహ నిశ్చయ తాంబూలాలుకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు అప్పుల బాధలు తీరిపోతాయి. ఇంతకుముందు ఉన్న మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఈరోజు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి: ఈరోజు వ్యాపారంలో లాభాలు !

ఈరోజు బాగుంటుంది. ఆరోగ్య విషయాలు బాగుంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలు ఈరోజు తగ్గిపోతాయి. ఈరోజు అందరితో చక్కగా ఉండి మీ ఆత్మీయతను అనురాగాన్ని పంచుతారు. ఈరోజు స్థిరాస్తులు అనుకూలిస్తాయి. ఇంతకుముందు వాయిదా పడిన పనులు ఈ రోజు అయిపోతాయి. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు హయగ్రీవ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు శ్రమ పెరుగుతుంది !

ఈరోజు శ్రమ వల్ల అన్ని పనులు సులభమవుతాయి. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమ పెరుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు. ఈరోజు పెద్దవారిని గౌరవించడం, వారి మాటలను సూచనలను పాటించడం మంచిది. ఆస్తి విషయంలో పెద్ద వారు చెప్పింది వినడం మంచిది లేకుంటే వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: అనారోగ్య సమస్యలు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా తొందర పడకుండా ఉండటం మంచిది. ఈరోజు చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఎక్కడైనా పడిపోయే వీలు ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటే పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు స్త్రీలు తెలియని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది, అనవసరపు పరచాలని పెంచుకోకుండా ఉండడం మంచిది.ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి: ఈరోజు ప్రయాణాలకు మంచి రోజు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు మీ కష్టాలన్నీ  పోతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు భార్య భర్తలు ఇద్దరు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో బాగుంటారు. ఇంతకుముందు అనారోగ్యం ఈరోజు తగ్గిపోతుంది. ఈరోజు స్నేహితుల సహకారం పొందుతారు. ఈరోజు ప్రయాణాలకు మంచి రోజు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు అప్పుల బాధలు తీరిపోతాయి.

పరిహారాలుః ఈరోజు లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

తులారాశి: డబ్బు విషయంలో జాగ్రత్త !

ఈరోజు మీ దురుసు  మాటల వల్ల అందరికీ దూరం అవుతారు. ఈ రోజు పెద్ద వారి మాటలను గౌరవించడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. మద్యపానం సేవ చేసి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది.ఈరోజు భార్య భర్తలు చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది పడతారు.

పరిహారాలుః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: తీర్థయాత్రలు చేస్తారు !

ఈ రోజంతా బాగుంటాది. ఏ పనిని అనుకున్న కష్టపడి సాధించి తీరుతారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఈ రోజు అప్పుల బాధలు తీరిపోతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి.

పరిహారాలుః ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తొందరపడి ఎవరిని అతిగా నమ్మకుండా మంచిది, లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు ప్రయాణాల విషయంలో విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆడపడుచులకు దూరంగా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ఈరోజు ఉద్యోగం లో ఉన్నతస్థాయి స్థానాన్ని పొందుతారు !

ఈరోజంతా బాగుంటుంది. ఈ రోజు అయిన వారితో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు, ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగం లో ఉన్నతస్థాయి స్థానాన్ని పొందుతారు. ఈరోజు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి: ఆరోగ్యంగా ఉంటారు !

ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం పొందుతారు. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఇంతకుముందు పోగొట్టుకున్న గౌరవాన్ని కీర్తన ఈరోజు పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి: ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు !

ఈరోజంతా బాగుంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ రోజు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు బంధువులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగం లో గౌరవ కీర్తనలను పొందుతారు. ఈరోజు నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు రామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి.