ఈ రాశుల వారిపై కృష్ణుడి అనుగ్రహం ఎక్కువట..!

-

శ్రీ కృష్ణుడు.. చిలిపి కృష్ణుడు.. కన్నయ్య.. కిట్టయ్య.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా పలుకుతాడు ఆ కృష్ణభగవానుడు. పవిత్రమైన మనస్సుతో.. నిజాయతీగా కోరుకుంటే ఏ కోరికనైనా ఇట్టే తీరుస్తాడు. కాస్త హార్డ్ వర్క్ చేయాలని చెబుతూనే.. లైఫ్ ని ఎంజాయ్ చేయాలనే విషయాన్ని కృష్ణతత్వం బోధిస్తుంది. కృష్ణుడి జీవితంలో ఎన్నో ఆటంకాలు.. మరెన్నో సమస్యలు.. అయినా ఆయన ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోదు. ఆ మందహాసానికి ఫిదా కాని వాళ్లంటూ ఎవరూ ఉండరు. ఎన్ని కష్టాలెదురైనా.. చిరునవ్వుతో వాటికి వెల్ కమ్ చెబుతూ లైఫ్ ని హ్యాపీగా గడిపే వారిపై కృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే వాళ్లపైనే కాకుండా.. కొన్ని రాశుల వారిపై శ్రీకృష్ణ అనుగ్రహం కాస్త ఎక్కువగా ఉంటుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం..

శ్రీకృష్ణుడికి కొన్ని రాశులు చాలా ప్రీతికరమైనవి అని పండితులు చెబుతున్నారు. ఆ రాశులు కలవారి జాతకానికి కన్నయ్య ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని అంటూంటారు. 13 రాశుల్లో ప్రతి రాశికి దాని స్వంత పాలక గ్రహం లేదా రాశి ఉంటుంది. వ్యక్తి రాశిచక్రం ప్రకారం.. వారి స్వభావం, భవిష్యత్తు గురించి లెక్కలు తయారు చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులలో కొన్ని రాశులు శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైనవిగా చెబుతారు.

శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో వసుదేవ-దేవకీలకు శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంగా జన్మించాడు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి మహాపర్వాన్ని ఆగస్టు 18, 19 తేదీల్లో జరుపుకుంటున్నారు. వృషభం – జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం.. వృషభం శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన రాశిగా చెబుతారు. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈ రాశి వారు చేసే కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. అందుకే ఈ రాశి వారు కిట్టయ్యను పూజించాలని పండితులు చెబుతుంటారు.

కృష్ణుడి మరో ఫేవరెట్ రాశి కర్కాటకం. కిట్టయ్య కర్కాటక రాశిపై కూడా తన దయ చూపిస్తాడట. ఈ రాశి గల వ్యక్తులు అన్ని కార్యక్రమాల్లో విజయం సాధిస్తారట. మత విశ్వాసాల ప్రకారం, శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఉన్నవారు మరణానంతరం మోక్షాన్ని పొందుతారని పురాణాల్లో ఉందట.

చిలిపి కృష్ణుడి దయ పొందే రాశుల్లో మరో రాశి సింహం. ఈ రాశిగల వారు శ్రద్ధ జీవులట. వీరు ఏ పని చేసినా వంద శాతం పట్టుదలతో శ్రద్ధపెట్టి చేస్తారంట. అందుకే వీరి శ్రమకు తగిన ఫలితం లభిస్తుందట. ఈ రాశి వారు రాధకృష్ణులను స్మరించడం ఉత్తమమని శాస్త్రాలు చెబుతున్నాయి.

తులా రాశి జాతకులకు కూడా శ్రీకృష్ణుని ప్రత్యేక అనుగ్రహం ఉంది. శ్రీకృష్ణభగవానుని అనుగ్రహంతో ఈ జాతకులు జీవితంలో అన్ని విధాల సుఖసంతోషాలు పొందుతారట. ఇలా కేవలం ఈ రాశుల వారికే గాక సమస్త కోటిపై శ్రీకృష్ణభగవానుడి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. కిట్టయ్యను స్మరిస్తూ.. ధర్మమార్గంలో.. శాంతిగా నడిచే వారందరికీ కృష్ణుడు దాసోహం.

Read more RELATED
Recommended to you

Latest news