మార్చి 25 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

 

మార్చి 25 – ఫాల్గుణ మాసం – గురువారం

మేషరాశి:ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. నోటి మాట జారడం వల్ల నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు తల్లిదండ్రులు మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ప్రయాణాలు అనుకూలించవు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.
పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న అమ్మవారు ఆలయానికి వెళ్లి దర్శించుకోండి.

todays horoscope

వృషభ రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

మిధునరాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి ఇతరులతో మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సమయాన్ని సద్వినియోగ పరచ కోకుండా కాలాన్ని వృథాగా గడుపుతారు. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగి పోతాయి. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యాపారాల్లో ధననష్టం కలుగుతుంది.
పరిహారాలుః ఈరోజు సంకటహర గణేశుని ఆరాధించండి. దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి దర్శించుకుని గరికను గణేశుడికి  సమర్పించండి.

కర్కాటకరాశి:ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది

ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. దైవ కార్యక్రమాల్లో  పాల్గొంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని డబ్బును తిరిగి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహరాశి:అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు అనవసరపు విషయాల వల్ల చదువు మీద ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా స్వల్ప నష్టాలు కలుగుతాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండటం మంచిది.
పరిహారాలుః ఈరోజు శ్రీ విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి:పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. చిన్నప్పటి ప్రాణ స్నేహితులు కలుసుకొని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుని ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక ధనలాభం పొందుతారు. ఎదుటి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఉద్యోగార్థులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.
పరిహారాలుః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి:ఆర్థిక లాభాలు కలుగుతాయి !

‌ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపారాల్లో అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును గౌరవాన్ని తిరిగి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి:విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన వృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారాల్లో గతంలో ఉన్న ఆటంకాలు దూరమై ధన లాభం కలుగుతుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

ధనస్సు రాశి:పై అధికారుల ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. విద్యార్థులు కష్టపడి చదువుకోవడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు అనర్ధాలు కలిగిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాక మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది.
పరిహారాలుః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించిండి.

మకరరాశి:ధన వృద్ధి కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని పై చదువులకు అర్హులవుతారు. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధనవృద్ధి కలుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గిపోయి, సంతోషంగా సఖ్యతగా ఉంటారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు.

పరిహారాలుః  ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

కుంభరాశి:ఆకస్మిక ధన లాభం !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. సోదరులతో కచ్చితంగా సంతోషంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి:వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు శుభ కరంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్పులు పొందుతారు. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును గౌరవాన్ని తిరిగి పొందుతారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విలువైన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సోదరులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.