సోలార్ సిస్టమ్ బయట పేద్ద చందమామ…!

-

సాధారణంగా చంద్రుడు ఏ వ్యవస్థలో ఉంటాడు… సోలార్ సిస్టమ్ లోపల ఉంటాడు. సౌర వ్యవస్థలోనే మనకు రోజూ కనిపించే చంద్రుడితో పాటు మరెన్నో చంద్రుళ్లు, ఇతర గ్రహాలు ఉంటాయి. కానీ.. సౌర వ్యవస్థకు బయట ఓ చంద్రుడిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అది నెఫ్ట్యూన్ గ్రహమంత పరిమాణంలో ఉందట. మనకు రోజూ కనిపించే చంద్రుడి కంటే చాలా పెద్దది. అంతే కాదు.. అది పూర్తిగా వాయువులతో నిండి ఉందట.

ఇది సౌరవ్యవస్థకు బయట నక్షత్ర మండలంలో ఉంది. దీంతో రీసెర్చర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సౌర వ్యవస్థలో దాదాపు 180 చంద్రుళ్లు ఉన్నా.. నక్షత్ర వ్యవస్థలో కనుగొన్న ఈ చంద్రుడు భిన్నంగా ఉండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొలంబియా యూనివర్శిటీ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డేవిడ్ కిప్పింగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ చంద్రుడిని కనుగొన్నది.

నిజానికి మన సౌర వ్యవస్థలో ఉన్న చందమామలు రాళ్లూరప్పలు, మంచుతో కూడి ఉంటాయి. కానీ.. నక్షత్ర వ్యవస్థలో ఉన్న ఈ చందమామ చాలా పెద్దగా ఉండి గురు గ్రహం కన్నా భారీగా ఉందట. దాంతో పాటు మరో గ్రహం కూడా జతగా ఉందట. ఇవి భూమికి 8000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయట. నాసాకు చెందిన హబుల్ రోదసీ టెలిస్కోప్, కెప్లర్ రోదసీ టెలిస్కోప్ ద్వారా ఈ చంద్రుడిని పరిశీలించి… దానికి సంబంధించిన మరిన్ని వివరాలను రీసెర్చర్స్ సేకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news