శివ‌న్ క‌న్నీరు… మోదీ తీవ్ర భావోద్వేగం

-

చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగానే కృషి చేశారు. ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంద‌న్న కాన్ఫిడెన్స్‌తోనే అంద‌రూ ఉన్నారు. 48 రోజులుగా సాగిన ఈ సుదీర్ఘ  ప్ర‌యాణంలో చివ‌రి 15 నిమిషాలు 130 కోట్ల మంది భార‌తీయుతు తీవ్ర ఉత్కంఠ అనుభ‌వించారు. చివ‌ర‌కు రెండు నిమిషాల్లో చంద్రయాన్ 2 చంద్రుడిపై అడుగుపెడుతుందని అనుకునేలోపు దాని నుంచి సిగ్నల్స్ అందకుండా పోయాయి. శాస్త్ర‌వేత్త‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.


చివ‌ర‌కు వారి బాధ అర్థం చేసుకున్న మోదీ వారిని స్వ‌యంగా ఓదార్చారు. ప్ర‌యోగం చివ‌ర్లో సిగ్న‌ల్స్ క‌ట్ అవ్వ‌డంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ దేశం శోధించని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోవడానికి భారత్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇక చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోవడంతో శివన్ తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు.

శివ‌న్ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో మోదీ హ‌త్తుకుని ఆయ‌న్ను ఓదార్చ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రికి  ధైర్యం చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ ఇస్రో ఛైర్మన్ శివన్ భుజం, వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాన్ని టీవీలు లైవ్ ఇవ్వడం దేశ ప్రజలందరినీ ఆకర్షించింది. చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోవడంతో శాస్త్రవేత్తలు ఎంత బాధపడుతున్నారో తెలుసని మోదీ భావోద్వేగంతో అన్నారు.

ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం చేసేందుకు మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు వారు గడిపి ఉంటారని ఆయన అన్నారు. చంద్రయాన్-2 విజయవంతం కావాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నం చేశారో వాళ్ల కళ్లే చెబుతున్నాయని మోదీ కొనియాడారు. ఇలాంటి సమయంలో దేశం మీ వెంటే ఉంటుందని ఆయన భరోస ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news