అవును.. 2030 లో మార్స్ మీదికి మనిషి వెళ్లడానికి మార్గం సుగుమమైంది. ఎందుకంటే.. మార్స్ మీదికి మానవ సహిత యాత్ర సులభం కావడం కోసం ఇన్ సైట్ కృషి చేయనుంది. ఈ ఇన్ సైట్ ఏంటి అంటారా? అది ల్యాండర్ వ్యోమనౌక. దాన్ని మార్స్ పైకి గత మే 5 న కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. అది సక్సెస్ ఫుల్ గా మార్స్ పైకి చేరుకున్నది. దాన్ని నాసా ప్రయోగించింది.
మన కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి అది మార్స్ పైకి చేరుకున్నది. ఈ ఇన్ సైట్ బరువు 365 కిలోలు ఉంటుంది. సుమారు 100 కోట్ల డాలర్ల ఖర్చుతో దీన్ని తయారు చేసింది నాసా. మార్స్ లోని ఎల్సియం ప్లానిషియా అనే ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయిన ఇన్ సైట్ మార్స్ లోని వాతావరణ స్థితులను వచ్చే రెండేళ్ల పాటు అధ్యయనం చేసి నాసాకు పంపించనుంది. అక్కడ ల్యాండ్ అయిన మరుక్షణమే అక్కడి ఫోటోలను ఇన్ సైట్ నాసాకు పంపించింది.