HTC నుంచి A101 ట్యాబ్‌లెట్‌..కాస్ట్‌ కమ్‌ ఫీచర్స్‌ ఇవే..

-

HTC నుంచి A101 ట్యాబ్‌లెట్‌ లాంచ్‌ అయింది. దక్షిణాఫ్రికా, రష్యాలో లాంచ్‌ అయిన ట్యాబెలెట్‌లో త్వరలో ఇండియా కూడా రానుంది. ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
హెచ్‌టీసీ ఏ101 ట్యాబ్లెట్ ధర..
దీని ధరను 19,890 రూబుల్స్‌గా అంటే సుమారు రూ.28,400 ఉంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ మాత్రమే ఇందులో అందించారు.
గ్రే, సిల్వర్ రంగుల్లో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌టీసీ ఏ101 స్పెసిఫికేషన్లు

ఇందులో 10 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1200 పిక్సెల్స్‌గా ఉంది. మెటల్ బాడీతో ఈ డివైస్‌ను రూపొందించారు.
యూనిసోక్ టీ618 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.
స్టోరేజ్‌ను పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డు అందించారు.
ఈ ట్యాబ్లెట్‌తో పోగో పిన్స్ కూడా అందించారు. అంటే ఆప్షన్ల్ కీబోర్డు కనెక్ట్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
7000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎల్టీఈ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్ కూడా ఇందులో ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ..

ట్యాబ్‌లెట్‌కు వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
మన దేశంలో ఈ ట్యాబ్‌లెట్‌ ఎప్పుడు లాంచ్‌ అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది ఇండియాలో లాంచ్‌ అయితే..మిడ్‌ రెండ్‌ కష్టమర్లును ఆకట్టుకుంటుందనే అభిప్రాయం ఉంది.!

Read more RELATED
Recommended to you

Latest news